logo

29 నుంచి ‘దీక్షా దివస్‌’

స్వరాష్ట్ర సాధనకు చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేస్తూ ఈనెల 29 నుంచి 11 రోజుల పాటు దీక్షా దివస్‌ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 03:51 IST

సమావేశంలో మాట్లాడుతున్న వినయ్‌భాస్కర్‌

బాలసముద్రం, న్యూస్‌టుడే: స్వరాష్ట్ర సాధనకు చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేస్తూ ఈనెల 29 నుంచి 11 రోజుల పాటు దీక్షా దివస్‌ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. బాలసముద్రంలో తెరాస కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీక్షా దివస్‌, కొవ్వొత్తుల ర్యాలీ, బైక్‌ ర్యాలీ, అమరవీరుల సంస్మరణ సభ, ఉద్యమకారులకు సన్మానం, పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం, అంబేడ్కర్‌ ఆలోచన కేసీఆర్‌ ఆచరణ పేరుతో సదస్సు, విద్యార్థి యువజన ఉద్యమకారుల అలాయ్‌ బలాయ్‌, డివిజన్లలో పతాకావిష్కరణ, ముగింపు రోజున తెరాస జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో రోజు ఒక్కో అతిథి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ముగింపు రోజున తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించామన్నారు.‘కేసీఆర్‌ సచ్చుడో - తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. కుడా ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, నయీంపాషా, పులి రజనీకాంత్‌, జోరిక రమేష్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని