logo

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ రాష్ట్రంలో రైతు కూలీల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.

Published : 29 Nov 2022 03:51 IST

రాజయ్య కాళ్లమీద పడి దళితబంధు ఇవ్వాలంటూ వేడుకుంటున్న యువతి

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ రాష్ట్రంలో రైతు కూలీల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. డివిజన్‌ కేంద్రంలో ఓ వేడుక మందిరంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రెండో జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు ఇవ్వండి సారూ..

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని ఓ వేడుక మందిరంలో సోమవారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రెండో మహాసభ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు తిప్పారపు అనూష, అశ్విని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాళ్లమీద పడి దళిత బంధు ఇప్పించాలని వేడుకున్నారు. తమ తల్లిదండ్రులు తిప్పారపు పరశురాములు, పుష్ప పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య సరే చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని