logo

అతివేగం అనర్థదాయకం

అతివేగం ప్రమాదకరమని, యువత అజాగ్రత్తగా వాహనాలు నడిపి తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని జనగామ ఎస్సై జీనత్‌ విద్యార్థులకు సూచించారు.

Updated : 29 Nov 2022 07:02 IST

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: అతివేగం ప్రమాదకరమని, యువత అజాగ్రత్తగా వాహనాలు నడిపి తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని జనగామ ఎస్సై జీనత్‌ విద్యార్థులకు సూచించారు. జనగామలోని స్వామి వివేకానంద ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో సోమవారం ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ ఉడుగుల రమేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు అన్ని రకాల ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తారో వివరించారు. దేశంలో మైనర్లే అధికంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు.

పాల్గొన్న విద్యార్థులు

సందేహాల నివృత్తి..!

విద్యార్థుల సందేహాలను ఎస్సై నివృత్తి చేశారు. త్రిపుల్‌ రైడింగ్‌, శిరస్త్రాణం ధరించకపోతే, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సైతం ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సూచనలు ఉపయోగపడతాయి
-రాజు,  విద్యార్థి

ట్రాఫిక్‌ నిబంధనలు, మైనర్ల పాత్రపై ఎస్సై చెప్పిన సలహాలు, సూచనలు మా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మా వల్ల మా తల్లిదండ్రులు పడే బాధలు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. విద్యార్థి దశలో కేసులు నమోదైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అన్ని కళాశాలల్లో నిర్వహిస్తే బాగుంటుంది. కొంతమందిలోనైనా మర్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అవగాహన కల్పిస్తాం
-ఝూన్సీ, విద్యార్థిని

ప్రమాదాల నివారణకు పోలీసులు అవగాహన కల్పించడం ఉపయోగకరం.  మావంతు బాధ్యతగా ట్రాఫిక్‌ నిబంధనలపై తల్లిదండ్రులు, సోదరులకు అవగాహన కల్పిస్తాం. అతివేగంతో జరిగే అనర్థాలను, పోలీసులు నమోదు చేసే కేసుల  విషయం మా కుటుంబ సభ్యులకు వివరిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని