logo

కళ్లు లేకున్నా బండి లోపం ఇట్టే పట్టేస్తారు!

కళ్లు లేవని ఆ యువకుడు కలత చెందలేదు. చుట్టూ చీకటే అని తలచుకొని బాధపడుతూ కూర్చోలేదు. తనను విధి వెక్కిరించినా, చెవులే కళ్లుగా చేసుకొని వాహన మెకానిక్‌గా నిశ్చింతగా జీవనం సాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు

Updated : 29 Nov 2022 07:10 IST

కళ్లు లేవని ఆ యువకుడు కలత చెందలేదు. చుట్టూ చీకటే అని తలచుకొని బాధపడుతూ కూర్చోలేదు. తనను విధి వెక్కిరించినా, చెవులే కళ్లుగా చేసుకొని వాహన మెకానిక్‌గా నిశ్చింతగా జీవనం సాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన హఫీజ్‌. వరంగల్‌ ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఎడమ కన్ను కోల్పోయారు.. అధైర్యం చెందక తన వృత్తిని కొనసాగించారు. 2005 దీపావళి వేళ  టపాసుల వల్ల లేచిన నిప్పురవ్వలతో కుడి కన్ను పోయింది. జీవితం నిండా కారుచీకటి నిండిందని భయపడక వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, దాతలు ఓ ఆటో కొనివ్వగా, ఆటోను అద్దెకిచ్చుకుంటూ వచ్చే కొద్దిపాటి సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తరచూ ఆటోకు మరమ్మతులు వచ్చేవి. అద్దెపై వచ్చే ఆదాయం మరమ్మతులకే పోయేది. అప్పుడు తనకున్న ఎలక్ట్రీషియన్‌ పరిజ్ఞానంతో ద్విచక్ర వాహనాల మరమ్మతులు ఆరంభించారు.. వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టే బండిలోని లోపాన్ని గర్తించి ఇట్టే మరమ్మతులు చేస్తున్న హఫీజ్‌ పరిజ్ఞానాన్ని గుర్తించిన వాహనదారులంతా ఆయన వద్దకు క్యూ కడుతున్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఉపాధి నిమిత్తం రుణం అందిస్తే పూర్తి స్థాయి మెకానిక్‌ షెడ్డు ఏర్పాటు చేసుకుని మరి కొందరికి ఉపాధి చూపగలనంటున్నారు హఫీజ్‌.

-ఈనాడు హనుమకొండ, న్యూస్‌టుడే-కాశీబుగ్గ(వరంగల్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని