మైనర్లకు వాహనాలివ్వొద్దు
ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండని తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని నగర పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న ట్రాఫిక్ అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి, పక్కన ఏసీపీ మధుసూదన్, కళాశాల డైరెక్టర్ జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి
వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండని తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని నగర పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు డీసీపీ కె.పుష్పారెడ్డి అన్నారు. మంగళవారం హన్మాన్నగర్లోని ఏకశిల జూనియర్ కళాశాలలో ‘ఈనాడు తెలంగాణ ఈటీవీ’ ఆధ్వర్యంలో ‘ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ’ అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పుష్పారెడ్డి మాట్లాడుతూ.. సరదా కోసం కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి కడుపు కోతకు గురవుతున్నారన్నారు. ప్రాణం చాలా విలువైనదని గుర్తుంచుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం మనందరి బాధ్యత అని, మైనర్లు వాహనాలను నడపకూడదన్నారు. పోలీసులు కావాలని వాహనాలకు చలాన్లు వేయడం లేదని, ప్రమాదాల నివారణ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2020లో 238, 2021లో 304, 2022 నవంబర్ వరకు 274 మంది మంది మృతి చెందారని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోతే కుటుంబం రోడ్డున పడి దిక్కులేకుండా తయారవుతుందన్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. కమిషనరేట్‌లో జీరో రోడ్డు ప్రమాదాల కోసం విద్యార్థులు కృషి చేయాలని తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పకుండా శిరస్త్రాణం ధరించాలన్నారు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. ఏకశిల విద్యా సంస్థల ఛైర్మన్ జి. తిరుపతిరెడ్డి, డైరెక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హాజరైన విద్యార్థులు
తగిన జాగ్రత్తలు తీసుకుంటాం
- శ్రీనిధి, ఇంటర్
ట్రాఫిక్ నిబంధనల గురించి పోలీసు అధికారులు చక్కగా వివరించారు. వాహనాలు నడిపే సమయంలో ఎలాంటి రక్షణ తీసుకోవాలో తెలిసింది. రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు ప్రయత్నాలు చేస్తాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.
అవగాహన కలిగింది
- కావ్య, బీపీసీ, రెండో సంవత్సరం
అవగాహన కలిగింది. భవిష్యత్తులో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తాం. నా తల్లిదండ్రులతో పాటు స్నేహితులకు కూడా చెప్పి నిబంధనలు పాటించేలా చూస్తాను.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి
-
Politics News
Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్ సూచన