logo

కడుపు‘కోతలే’!

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవ శస్త్రచికిత్సలు తగ్గడం లేదు. వైద్యులు సాధారణ ప్రసవాలు చేయాలనుకున్నా.. గర్భిణులు నొప్పులు భరించలేకపోవడం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి తదితర కారణాలవల్ల కోతల వైపే మొగ్గుచూపుతున్నారు.

Published : 30 Nov 2022 03:53 IST

జిల్లాలో 40 శాతం శస్త్రచికిత్సల ప్రసవాలే

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవ శస్త్రచికిత్సలు తగ్గడం లేదు. వైద్యులు సాధారణ ప్రసవాలు చేయాలనుకున్నా.. గర్భిణులు నొప్పులు భరించలేకపోవడం, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి తదితర కారణాలవల్ల కోతల వైపే మొగ్గుచూపుతున్నారు. గత ఏడు నెలల్లో 40శాతానికిపైగా చేయడం ఆందోళన కలిగించే విషయమే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం శస్త్రచికిత్స ప్రసవాలు 15 శాతానికి మించకూడదు.  కానీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోం వైద్యులు వ్యాపారం కింద మార్చేస్తున్నారు. 24 గంటలపాటు పరిశీలనలో ఉంచి సాధారణ ప్రసవం అయ్యేవరకు ఓపిక పడుతున్న వారు చాలా తక్కువ. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నా.. అక్కడి వైద్యులు ఏరియా, జిల్లా ఆసుపత్రులకు, బోధనాసుపత్రులు వరంగల్‌ సీˆకేఎం, హనుమకొండ జీఎంహెచ్‌ ఆసుపత్రులకు పంపించి చేతులు దులుపేసుకుంటున్నారు.

ఆసుపత్రి వార్డులో ప్రసూతి మహిళలు

అనారోగ్య సమస్యలు

* శస్త్రచికిత్స ప్రసవమైన వారిలో కుట్టు వద్ద చర్మం పల్చపడి హెర్నియా(పేగు) బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

* పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు ఆస్తమా, ఎలర్జీలు వస్తాయి. ఇన్ఫెక్షన్‌ శాతం ఎక్కువగా వస్తుంది.

* ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సమస్యలు

* వరంగల్‌ సీˆకేఎం, హనుమకొండ జీఎంహెచ్‌ ఆసుపత్రిలో దూరప్రాంతాల నుంచి వచ్చే గర్భిణుల సహాయకులకు గతంలో ప్రత్యేక గదులుండేవి. పాతవి కావడంతో తొలగించారు. ప్రత్యేక గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* ప్రభుత్వం సీడీఎస్‌ ద్వారా సరఫరా చేసే మందుల్లో 40 శాతం అందడం లేదు. ముఖ్యంగా గర్భిణుల నొప్పుల నివారణకు ఇచ్చే మెట్రోజిన్‌ మాత్రలు, విటమిన్‌-సి మాత్రలు, అమేక్సిన్‌, యాంటీబయాటిక్స్‌ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. చిన్నపిల్లలకు సంబంధించిన యాంటీబయాటిక్స్‌ ఇంజక్షన్లు సరఫరాలేక బయట తెచ్చుకుంటున్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు