logo

అడవికి బందోబస్తు..

కాళేశ్వరం వద్ద పోడు పేరిట ఆక్రమణకు గురవుతుందని గ్రహించిన అటవీ శాఖ అధికారులు భూమి చుట్టూ కందకాలు(ట్రెంచ్‌)లు తీశారు. గతంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం అటవీ శాఖాధికారులు 10 ఎకరాల అటవీ భూమిని పంచాయతీ పాలకవర్గానికి కేటాయించిన విషయం విదితమే.

Published : 30 Nov 2022 03:53 IST

కాళేశ్వరం వద్ద పోడు పేరిట ఆక్రమణకు గురవుతుందని గ్రహించిన అటవీ శాఖ అధికారులు భూమి చుట్టూ కందకాలు(ట్రెంచ్‌)లు తీశారు. గతంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం అటవీ శాఖాధికారులు 10 ఎకరాల అటవీ భూమిని పంచాయతీ పాలకవర్గానికి కేటాయించిన విషయం విదితమే. పంచాయతీ పాలకవర్గం 10 ఎకరాలు చదును చేసి మూడు ఎకరాల్లోనే మొక్కలు నాటారు. మిగతా 7 ఎకరాలు పోడు పేరిట ఆక్రమణకు గురవుతుందని గ్రహించిన అధికారులు ఈ నెల 21న కొంతమేర కందకాలు తీసి వదిలేశారు. జేసీబీ యంత్రం దెబ్బతినడంతో కందకాలను నిలిపివేశారు. అటవీ శాఖ అధికారులు కావాలని వదిలేశారని విమర్శలు రావడంతో మంగళవారం పోలీసు బందోబస్తు నడుమ అటవీక్షేత్రాధికారిణి కమల, సెక్షన్‌ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో జేసీబీ యంత్ర సహాయంతో కందకాలు తీశారు. ఈ విషయంపై అటవీక్షేత్రాధికారిణి కమలను సంప్రదించగా ఇటీవల కొంత కందకం తీశామని, మంగళవారం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నామన్నారు.

- న్యూస్‌టుడే, కాళేశ్వరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని