logo

పాఠశాలల నిర్వహణకు నిధులు

ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధులు విడుదలయ్యాయి. గత విద్యాసంవత్సరం ముగింపు సమయంలో ప్రభుత్వం రాష్ట్రంలోని బడులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పూర్తిగా రద్దు చేయించింది.

Published : 30 Nov 2022 03:53 IST

మొదటి విడత రూ.3.86 కోట్లు మంజూరు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధులు విడుదలయ్యాయి. గత విద్యాసంవత్సరం ముగింపు సమయంలో ప్రభుత్వం రాష్ట్రంలోని బడులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పూర్తిగా రద్దు చేయించింది. నిధులను వెనక్కి తీసుకుంది. దీంతో చాక్‌పీస్‌, డస్టర్లు, చీపుర్లు కొనుగోలు చేసేందుకు కూడా పైసలు లేకుండా పోయాయి. ఈ తరుణంలోనే ప్రాథమిక పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమం నిర్వహిసున్నారు. ప్రతిరోజూ బోధనోపకరణాలతో బోధించాల్సి ఉంటుంది. ఇందుకు ఛార్టులు తదితరాలు కొనుగోలు చేయాలి. దీంతో నిధుల కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు మంగళవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు రూ.7.73 కోట్లు కేటాయించింది. ఇందులో 50 శాతం అంటే రూ.3.86 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ఎస్సీ కాంపోనెంట్‌ కింద 24 శాతం, ఎస్టీ కాంపోనెంట్‌ కింద 14 శాతం, జనరల్‌ కేటగిరి కింద 62 శాతం నిధులు ఇచ్చింది. వీటితో పాఠశాలలకు ఊరట కలిగించింది. ఖర్చుకు సంబంధించిన బిల్లులను పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో అప్‌లోడ్‌ చేసి వినియోగించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని