ఆదివాసి.. చిత్రాలు మెరిసి
ఆదివాసీలు నేటికీ వారి సంస్కృతీసంప్రదాయాలు కొనసాగిస్తున్నారు.. చిత్రకళతో వారి జీవన విధానాలను, చరిత్రను పదిలంగా ఉంచుతున్నారు.. యువత అందిపుచ్చుకుని ప్రపంచానికి వారసత్వ కళను పరిచయం చేస్తోంది.
గిరి పుత్రులకు ఉపాధి
అమెజాన్‌లోనూ విక్రయాలు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
ఆదివాసీలు నేటికీ వారి సంస్కృతీసంప్రదాయాలు కొనసాగిస్తున్నారు.. చిత్రకళతో వారి జీవన విధానాలను, చరిత్రను పదిలంగా ఉంచుతున్నారు.. యువత అందిపుచ్చుకుని ప్రపంచానికి వారసత్వ కళను పరిచయం చేస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆదివాసీˆ యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 2015లో గిరిజన సంక్షేమ శాఖ ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీˆ కోయ, నాయక్‌పోడ్, గోండు తెగల చిత్రకళల్లో శిక్షణ ఇప్పించింది.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధి నుంచి 15 మంది గిరిజన చిత్రకళలో తర్ఫీదు పొందారు. వీరంతా ఆదివాసీలు వినియోగించే వస్తువులు, సంప్రదాయ నృత్యాలు, అటవీ జంతువులు, తదితర చిత్రాలను ఎంతో అందంగా గీస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే భవనాలకు, గోడలకు అవసరమైన ప్రదర్శనలకు పెయింటింగ్స్ వేస్తున్నారు. సంప్రదాయ రీతిలో కేవలం ఇండియన్ రెడ్ రంగులోనే వీరి చిత్రాలుంటాయి. ఆదివాసీలు కొలిచే దేవతామూర్తుల ప్రతిమలను రంగులతో ముస్తాబు చేస్తారు. సమ్మక్కసారలమ్మ జాతర, గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో ప్రముఖులకు ఆదివాసీˆ పెయింటింగ్స్‌ను బహుమతిగా ప్రదానం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని హైదరాబాద్, మేడారం, భద్రాచలం, తదితర ప్రాంతాల్లోని గిరిజన మ్యూజియాల్లో ప్రదర్శనతో పాటు విక్రయాలు జరుపుతున్నారు. వాటి సైజులకు అనుగుణంగా ఒక్కో పెయింటింగ్ రూ.1500 నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. అమెజాన్‌లోనూ గిరిజన సంక్షేమ శాఖ విక్రయిస్తోంది.
చిత్రాలను వీక్షిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్
సొసైటీగా ఏర్పడి..
శిక్షణ తీసుకున్న 15 మంది యువ కళాకారుల్లో ప్రస్తుతం ఎనిమిది మంది ఆదివాసి ఆర్టిస్ట్ సొసైటీగా ఏర్పడ్డారు. వట్టం నవీన్ కన్వీనర్‌గా, కుర్సం శ్రీధర్, తొర్రెం వేణుమాధవరావు, చుంచ కుమారస్వామి, కోడం నరేశ్, బంగారు సురేశ్, చిడెం బలరాం, గడివి నాగబాబు సొసైటీలో ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరి పెయింటింగ్స్‌ను ప్రదర్శిసున్నారు. వారికి ప్రత్యేక కార్యశాలలు నిర్వహిస్తూనే, ఆర్డర్లు ఇప్పించి పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ఏటా వారికి వచ్చే ఆర్డర్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వపరంగా వారికి రాయితీ రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తే చాలా మంది చిత్రకళలో రాణిస్తారు.
ప్రభుత్వ పనులు కేటాయించాలి
- వట్టం నవీన్, ఆదివాసి ఆర్టిస్ట్ సొసైటీ కన్వీనర్
గిరిజన సంక్షేమ శాఖ ప్రోత్సాహంతో ఆదివాసీˆ చిత్రాలను గీస్తున్నాం. సొసైటీగా ఏర్పడి ఆర్డర్లకు అనుగుణంగా మాత్రమే పెయింటింగ్స్ వేస్తున్నాం. చిత్రకళను జీవనోపాధిగా మల్చుకునేందుకు చాలా మంది యువత ముందుకొస్తున్నారు. అలాంటి వారికి శిక్షణ ఇప్పించాలి. ఎప్పటికీ పని దొరకాలంటే ప్రభుత్వం చేపట్టే భవనాలకు, పథకాల వాల్ రైటింగ్స్, తదితర ఆర్డర్లను తమకే ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
కళాకారులకు ఆదాయం పెరిగేలా చూడాలి
- కుర్సం శ్రీధర్, చిత్రకారుడు
ఆదివాసీల జీవన వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా చిత్రాలను వేస్తున్నాం. వివిధ రకాల బొమ్మలు, ఆదివాసీ చరిత్రను జెండాలపై చిత్రాల రూపంలో గీస్తాం. ప్రభుత్వాలు గిరిజన చిత్రకారులకు అండగా ఉండి ఆదాయం పెరిగేలా చూడాలి. పురాతన ఆదివాసి కళలను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే