logo

వీరభద్రుడి హుండీల ఆదాయం రూ.33.64 లక్షలు

కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయం హుండీల ద్వారా ఆదాయం రూ.33.64 లక్షల ఆదాయం సమకూరింది.

Published : 02 Dec 2022 04:31 IST

నగదు లెక్కిస్తున్న సేవా ట్రస్టు సభ్యులు

కురవి, న్యూస్‌టుడే: కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయం హుండీల ద్వారా ఆదాయం రూ.33.64 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులు దర్శించుకొని కానుకల రూపంలో ఆలయంలోని 17 హుండీలలో 2022 ఆగస్టు 10 నుంచి నవంబరు 30 వరకు భక్తులు వేసిన కానుకలను గురువారం ఆలయ ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కించారు. అందులో శ్రీవీరభద్రస్వామి వద్ద హుండీల్లో రూ.26.82 లక్షలు, భద్రకాళీ దేవి హుండీల్లో రూ.6.82 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మహబూబాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ కవిత పర్యవేక్షణలో లెక్కించారు. వీటితో పాటు మిశ్రమ వెండి, బంగారు అభరణాలు హుండీల్లో వేసినట్లు తెలిపారు. నగదును శ్రీవీరభద్రస్వామి పేరుతో గల ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మహబూబాబాద్‌కు చెందిన వేంకటేశ్వర, మహాలక్ష్మి సేవా ట్రస్టుల సభ్యులు లెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని