logo

నియమావళి పాటిస్తే.. ప్రమాదాలు దూరం

‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. నియమావళి అనుసరిస్తే ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చు..

Published : 02 Dec 2022 04:31 IST

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: ‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. నియమావళి అనుసరిస్తే ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చు.. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు.. ట్రాఫిక్‌ నియమావళి పాటించేలా ప్రతి ఒక్కర్ని చైతన్యవంతులు కావాలి’ అని మహబూబాబాద్‌ పట్టణ సీఐ వై.సతీష్‌ విద్యార్థులకు సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మద్యం తాగి వాహనం నడపడం, మితిమీరిన వేగం, చరవాణిలో మాట్లాడుతూ వాహనం నడపడం సరికాదన్నారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల డ్రైవింగ్‌లో పూర్తి స్థాయిలో అవగాహన లేక ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండి వాహనాలపై అవగాహన ఉన్న వారు మాత్రమే నడపాలన్నారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ నాయిని వీరేందర్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న పట్టణ సీఐ వై.సతీష్‌


జాగ్రత్తలు తీసుకొనేలా ప్రచారం

జి.సాగర్‌ బైపీసీ మొదటి సంవత్సరం

ట్రాఫిక్‌ నిబంధనల గురించి సమగ్రంగా తెలియజేశారు. వాహనాలు నడిపై సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తా.


ప్రమాదాల నివారణకు కృషి

కె.మధు హెచ్‌ఈసీ రెండో సంవత్సరం

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై గ్రామీణులకు అర్ధమయ్యేలా వివరిస్తాం. తగిన జాగ్రత్తలు తీసుకొనేలా కృషి చేస్తాం.


శిరస్త్రాణం ధరించాలి

టి.సంధ్య ఎంఎల్‌టీ మొదటి సంత్సరం

ప్రమాదాల నివారణకు పోలీస్‌ శాఖ తీసుకుంటున్న చర్యలపై అవగాహన కలిగింది. ద్విచక్రవాహనదారులు నియమావళి పాటిస్తూ విధిగా శిరస్త్రాణం ధరించాలని చెబుతాం.

హాజరైన విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని