logo

గులాబీ శ్రేణుల్లో దీక్షా దివస్‌ జోష్‌

గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీక్షా దివస్‌ ఉత్సవాల్లో భాగంగా గురువారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం తెరాస కార్యకర్తలు కదం తొక్కారు.

Published : 02 Dec 2022 04:53 IST

బల్దియా ప్రధాన కార్యాలయం పైలాన్‌ వద్ద నేతల నినాదాలు

రంగంపేట, న్యూస్‌టుడే: గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీక్షా దివస్‌ ఉత్సవాల్లో భాగంగా గురువారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం తెరాస కార్యకర్తలు కదం తొక్కారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి ములుగు రోడ్డు, అలంకార్‌, హనుమకొండ చౌరస్తా, పబ్లిక్‌ గార్డెన్‌, నక్కలగుట్ట కూడలి మీదుగా అదాలత్‌ సెంటర్‌ అమరవీరుల స్తూపం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, రాష్ట్ర రుణ విమోచన సంస్థ ఛైర్మన్‌ నాగూర్ల వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎండీ.అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహనికి పూల మాలేసి నివాళులర్పించారు. దీక్షా దివస్‌ స్ఫూర్తి చిహ్నానికి గౌరవ వందనం చేశారు.  రాష్ట్ర సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష మైలురాయి అని నాయకులు కొనియాడారు. దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని 11 రోజుల పాటు నిర్వహిస్తామని చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రకటించారు. డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పునరంకిత సభ నిర్వహిస్తామన్నారు.

కార్యకర్తల ప్రదర్శన


సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

దీక్ష దివస్‌ కార్యక్రమాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం హనుమకొండ అదాలత్‌ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద తెరాస నాయకులు, కార్యకర్తలు అమరులకు నివాళులర్పించారు. వరంగల్‌ నుంచి ర్యాలీగా తరలి వచ్చారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పలువురు లబ్దిదారులకు రూ.30.60 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని