logo

పగిలిన భగీరథ పైపు.. 12 ఎకరాల ధాన్యం నీటిపాలు

నాలుగు నెలలు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని ఆ రైతులు నాలుగు రోజులుగా రహదారిపై ఆరబోశారు. మరి కొద్ది గంటల్లో మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకునేవారు.

Published : 02 Dec 2022 04:53 IST

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భగీరథ నీరు

ఖానాపురం, న్యూస్‌టుడే: నాలుగు నెలలు చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని ఆ రైతులు నాలుగు రోజులుగా రహదారిపై ఆరబోశారు. మరి కొద్ది గంటల్లో మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకునేవారు. వారి ఆశలు కాస్తా పగిలిన మిషన్‌ భగీరధ పైపు నుంచి వచ్చిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వరంగల్‌ జిల్లా ఖానాపురంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు అన్నదాతలకు చెందిన 12 ఎకరాల పంట నీటి పాలైంది. కాంటా పెట్టే రోజునే పంట నీటిపాలవడంతో దాదాపు రూ.8 లక్షల మేర నష్టపోయామని రైతులు కన్నీటిపర్యంతం చెందారు. జగన్మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సందీప్‌, గాంధీ అనే బాధిత రైతులు, స్థానికులు తెలిపిన ప్రకారం  గురువారం వేకువజామున 5.30 గంటలకు పెద్ద శబ్దం చేస్తూ భగీరథ పైపు పగిలింది. మంచి నిద్రలో ఉన్న పరిసర ఇళ్లలోని వారు లేచి రోడ్డు మీదకు వచ్చేలోపే నీరంతా ఉప్పెనలాగా రోడ్డుపైకి ప్రవహించి వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. పైప్‌లైన్‌ నిర్మాణంలో ఐరన్‌ జాయింట్ ఫెయిల్‌ కావడంతోనే పైప్‌ పగిలినట్లు అధికారులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేరుకొని అధికారులతో మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుత్తేదారులతో మాట్లాడి రైతులకు పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే దొంతి కోరారు. భగీరథ గ్రిడ్‌ డీఈఈ ప్రదీప్‌కుమార్‌, ఏఈ సతీష్‌ పరిశీలించి మరమ్మతులు చేసేందుకు సన్నద్ధం కాగా పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రైతులు తేల్చి చెప్పడంతో వెనుదిరిగారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు