logo

అత్యాచారం కేసులో ప్రజాప్రతినిధి పీఏ..

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ నిందితుడిగా ఉన్నారు.

Updated : 02 Dec 2022 07:16 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ నిందితుడిగా ఉన్నారు. హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. ఇతర జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని నగరంలోని ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ న్యాయ విద్య చదువుతోంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆమె చరవాణిలో మాట్లాడుతుండగా.. వసతి గృహం నిర్వాహకురాలు గమనించింది. తాను చెప్పినట్లు చేయాలని.. లేకపోతే మీ అమ్మానాన్నకు చెబుతానని బెదిరించింది. భయపడిన యువతి అందుకు అంగీకరించింది. ఓ రోజు అలంకార్‌ జంక్షన్‌ సమీపంలోని గదికి విద్యార్థినిని తీసుకెళ్లింది. అక్కడున్న వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఆ తర్వాత నక్కలగుట్టలోని ఓ హోటల్‌ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రజాప్రతినిధి పీఏ సైతం ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఫొటోలను తీసుకొని వసతి గృహం నిర్వాహకురాలు, ఇతరులకు పంపించారు. ఈ వేధింపులు భరించలేని బాధితురాలు.. తనను మానసికంగా వేధించారని, ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని, వారికి వసతి గృహం నిర్వాహకులు సహకరించారని హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని