logo

ఆధార్‌ నవీకరణ తప్పనిసరి

జిల్లాలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆధార్‌ నవీకరణ చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

Published : 03 Dec 2022 04:46 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆధార్‌ నవీకరణ చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 5- 15 ఏళ్ల పిల్లలకు ఆధార్‌ కేంద్రాల్లో నవీకరణకు ఎటువంటి ఛార్జీలు ఉండవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పొందాలనుకుంటే ఆధార్‌ నవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 2016 కంటే ముందు గుర్తింపు కార్డు పొందిన వారంతా యూఐడీఏఐ ఆదేశాల మేరకు సంబంధిత పత్రాలతో ఆధార్‌ కేంద్రాలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆధార్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, డీఆర్‌వో వాసుచంద్ర, డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఈ డిస్ట్రిక్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు పొందాలి: జిల్లాలో అర్హులైన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు కోరారు. డిసెంబర్‌ 3, 4 తేదీలలో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని