logo

ధరణి సమస్యలు పరిష్కారం దిశగా..

ధరణిలో సాంకేతిక సమస్యలతో ఏర్పడిన లోపాలను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.

Published : 03 Dec 2022 04:46 IST

కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ధరణిలో సాంకేతిక సమస్యలతో ఏర్పడిన లోపాలను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు హనుమకొండలోని కలెక్టరేట్‌లోనే మకాం వేశారు. పది రోజులుగా ధరణి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిషేధిత జాబితాలో చేరినా, ఎవైనా పొరపాట్లు దొర్లినా, ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

అవగాహన కలిగిలా చర్యలు: పాసు పుస్తకాల్లోని తప్పులు సవరించడం, పెండింగ్‌లో ఉన్న పట్టా మార్పిడిలు, న్యాయస్థానాల ఉత్తర్వుల ద్వారా పాసు పుస్తకాలు పొందడం, నిషేధిత జాబితా నుంచి తొలగించడం వంటి వాటిని సవరించేలా ఆరు మాడ్యూల్స్‌ ఉన్నాయి. అయితే ఏ సమస్య పరిష్కరానికి ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపై అధికారులు తహసీల్దార్‌ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల వద్ద  అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల టీఎం-33 మాడ్యూల్‌ను తీసుకువచ్చారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకంలో వచ్చిన తప్పులను సవరించే అవకాశం ఉంది. పట్టాదారు పేరు మార్చడం, సర్వే నంబరు చేర్చడం, ప్రభుత్వ ఖాతా నుంచి వ్యక్తిగత ఖాతాకు మార్చడం, భూ విస్తీర్ణ సవరణ లాంటి వాటి కోసం టీఎం-33 మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత 10 రోజులుగా మండల స్థాయి అధికారులు పాలనాప్రాంగణంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం పూట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయంత్రం రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు అధికారులు కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని