logo

ప్రజలకు భరోసా కలిగేలా సేవలు

సామాన్య ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంచడమే  ప్రధాన లక్ష్యమని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఆయన శనివారం సీపీ తరుణ్జోషి నుంచి బాధ్యతలు తీసుకున్నారు.

Published : 04 Dec 2022 04:47 IST

సీపీ రంగనాథ్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: సామాన్య ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంచడమే  ప్రధాన లక్ష్యమని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. ఆయన శనివారం సీపీ తరుణ్జోషి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కమిషనరేట్‌ సాయుధ  పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తరుణ్‌జోషి, ఇతర పోలీసు అధికారులు  పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో రంగనాథ్‌ మాట్లాడుతూ చట్టబద్ధంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. సామాన్య ప్రజలకు భరోసా కలిగించే విధంగా పోలీసింగ్‌ ఉంటుందన్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇంకా ఏం చెప్పారంటే..

* వరంగల్‌ నగరంలో భూఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతాం. పోలీసులు భూవివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎస్‌వోపీ పాటిస్తూ కేసులను పరిష్కరించాలి.

* సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఎన్నికల వాతావరణ దగ్గర పడతుంది.. ఎదుటి వ్యక్తులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారిని ఇబ్బంది పెడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.

* రాజకీయ పార్టీల మధ్యలో పోటీ సహజం. దీన్ని ఆసరాగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా కులమతాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లు పెట్టడం, లేదా మాట్లాడడం లాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఎస్‌ఎంఎస్‌ చేసినా స్పందిస్తాను

* ప్రజలు వారి సమస్యలను చెప్పుకొనేందుకు నేరుగా వచ్చి నన్ను కలవొచ్చు. లేదా చరవాణి ద్వారా సంక్షిప్త సమాచారం పంపినా జవాబు ఇస్తాను. ప్రజలకు కమిషనరేట్‌ ద్వారాలు తెరిచి ఉంటాయి.  

* కమిషనరేట్‌లో వివిధ ఠాణాల్లో పనిచేసే అధికారుల పనితీరును ప్రజలు ఇచ్చే సమాచారంతోనే బేరీజు వేస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు పనిచేయాలి.

* విలేకరుల సమావేశంలో డీసీపీలు అశోక్‌కుమార్‌, వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డీసీపీ కె. పుష్పరెడ్డి, వైభవ్‌ గైక్వాడ్‌, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని