logo

నెరవేరిన కల..!

మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా ప్రకటించిన మండలం ఇనుగుర్తిలో ఆదివారం ఉదయం 11 గంటలకు  తహసీల్దారు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

Published : 04 Dec 2022 04:47 IST

నేడు ఇనుగుర్తి  తహసీల్దారు కార్యాలయం ప్రారంభం

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీవో కొమురయ్య, అధికారులు

కేసముద్రం, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా ప్రకటించిన మండలం ఇనుగుర్తిలో ఆదివారం ఉదయం 11 గంటలకు  తహసీల్దారు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా మంత్రులు దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో పాలన అధికారిగా పనిచేస్తున్న దిలావర్‌ మహ్మద్‌ అబీద్‌అలీ ఇనుగుర్తి మండల తహసీల్దారుగా విధుల్లో చేరనున్నారు. 2022 జులై 25న ఇనుగుర్తి మండల ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ తరువాత మునుగోడు ఎన్నికలతో పాటు పలు కారణాలతో మండల ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వచ్చారు. ఆదివారం మండల ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రకటించడంపై ఇనుగుర్తి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని మండల తహసీల్దారు కార్యాలయానికి కేటాయించారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఆర్డీవో కొమురయ్య శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.

మండలంలోని గ్రామాలు ఇవే

కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి, కోమటిపల్లి, నెల్లికుదురు మండలంలోని చిన్ననాగారం, చిన్నముప్పారం, మేచరాజుపల్లి రెవెన్యూ గ్రామల్లోని కోమటిపల్లి, పాతతండా, తారాసింగ్‌తండా, ఇనుగుర్తి, లాలుతండా, అయ్యగారిపల్లి, చీన్యాతండా, చిన్ననాగారం, చిన్నముప్పారం, పెద్దతండా(సీఎంపీ), పెద్దతండా(ఎంఆర్‌పీ), లక్ష్మిపురం, మిట్యాతండా, మేచరాజుపల్లి.

* 4 పంచాయతీల్లోని 22,629 జనాభాతో కొత్త మండలం ఏర్పాటైంది. మేచరాజపల్లికి చెందిన కొంత మంది నేతలు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని