సౌత్‌జోన్ ఈత పోటీలు ప్రారంభం
రంగశాయిపేట శివారులోని బిర్లా ఓపెన్ మైండ్స్ హై స్కూల్లో సీబీఎస్ఈ సౌత్‌జోన్ స్థాయి ఈత పోటీలను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.
క్రీడా జ్యోతితో ఎమ్మెల్యే రమేష్, నిర్వాహకులు
రంగశాయిపేట, న్యూస్‌టుడే: రంగశాయిపేట శివారులోని బిర్లా ఓపెన్ మైండ్స్ హై స్కూల్లో సీబీఎస్ఈ సౌత్‌జోన్ స్థాయి ఈత పోటీలను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములు సహజంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని వెలిగించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల నుంచి 1200 క్రీడాకారులు, శిక్షకులు భాగస్వాములయ్యారు. ఇందులో రాష్ట్రంలోని వరంగల్, మొదక్, హైదరాబాద్ ప్రాంతాల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, సౌత్‌జోన్ మాస్టర్ ఫ్రాంచైజీ సాయి సందీప్, భారత స్విమ్మింగ్ ఫెడరేషన్ కోశాధికారి రామకృష్ణ, వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు, 43, 44 డివిజన్ల కార్పొరేటర్లు జలగం అనిత, ఈదురు అరుణ, ప్రిన్సిపాళ్లు రాజ్‌కుమార్ జోషి, మెర్గిన్ మన్నస్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..