కేఎంసీ ఉత్కర్ష వేడుకలు ప్రారంభం
వైద్య విద్యార్థులు తమ సేవలను గ్రామీణ ప్రజలకు అందించడానికి మక్కువ చూపాలని వరంగల్ జిల్లా పాలనాధికారి గోపి అన్నారు.
క్రీడాజ్యోతి వెలిగించి అందిస్తున్న కలెక్టర్ గోపి, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాసు, ఎంజీఎం సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వైద్య విద్యార్థులు తమ సేవలను గ్రామీణ ప్రజలకు అందించడానికి మక్కువ చూపాలని వరంగల్ జిల్లా పాలనాధికారి గోపి అన్నారు. కాకతీయ వైద్య కళాశాలలో కళాశాల, మెడికోఫెస్ట్ ఉత్కర్ష-22 పేరిట వారం రోజుల నిర్వహించే ఉత్సవాలను శనివారం సాయంత్రం ఆయన క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో భయపడకుండా వైద్యసేవలను అందించిన వైద్యులు, వైద్యవిద్యార్థులను కలెక్టర్ అభినందించారు. వారం పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో కరోనా కాలంలో మీ కష్టాన్ని మరిచిపోయి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇండో అమెరికన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు మాట్లాడుతూ వైద్యవిద్యార్థులు ఒత్తిడిని జయించి రాణించడానికి క్రీడలను జీవితంలో ఒక భాగంగా ఎంచుకోవాలని సూచించారు. కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాసు మాట్లాడుతూ ఆదివారం కేఎంసీ నుంచి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించే హెల్త్ రన్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్‌చంద్రశేఖర్, కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వైద్యాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం