logo

రేషన్‌ బియ్యం.. అక్రమార్కుల పరం

పేదలకు చెందాల్సిన రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. వ్యాపారులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 07 Dec 2022 05:25 IST

ఇటీవల రైస్‌మిల్లులో బియ్యం బస్తాలను పట్టుకున్న పోలీసులు

హనుమకొండ కలెక్టరేట్‌, కమలాపూర్‌, న్యూస్‌టుడే: పేదలకు చెందాల్సిన రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. వ్యాపారులు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మిల్లుల్లో నూకలుగా మార్చి లిక్కర్‌ కంపెనీలు, కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు.

మహారాష్ట్రకు తరలింపు

గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రూ.10కి కొనుగోలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. మహారాష్ట్రలో మన బియ్యానికి బాగా డిమాండ్‌ ఉంది. రూ.18 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. కిలోకు రూ. 8 నుంచి రూ. 15 వరకు లాభాన్ని గడిస్తున్నారు.

కమలాపూర్‌ కేంద్రంగా...

కమలాపూర్‌ మండలాన్ని కేంద్రంగా చేసుకొని వివిధ గ్రామాల్లో ఈ బియ్యం దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మండలంలోని రైల్వేస్టేషన్‌తో పాటు దాని పక్కన ఉన్న ఓ గ్రామం నుంచి నిత్యం వందల క్వింటాళ్ల మేర లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గతంలో పుమార్లు అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేసినా దందా ఆగడం లేదు. కొందరు రైస్‌ మిల్లుల యజమానులు సైతం భాగస్వాములవుతున్నారని తెలిసింది.
* కమలాపూర్‌ మండలం అంబాల, పంగిడిపల్లి, కమలాపూర్‌, ఉప్పల్‌ గ్రామాల్లో స్థానిక పోలీసులు దాడులు చేసి  60 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలల్లో 12 కేసులు నమోదయ్యాయి.
* ఇటీవల ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రైలులో తరలించడానికి సిద్ధంగా ఉన్న 50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మందికిపైగా కేసులు నమోదు చేశారు.
* కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో నిత్యం 50 నుంచి 60 క్వింటాళ్ల మేర రేషన్‌ బియ్యం వివిధ ప్రాంతాలకు అర్ధరాత్రి నుంచి లారీల్లో దర్జాగా తరలిస్తున్నారు. దళారులందరూ వాహనాల్లో బియ్యం బస్తాలను ఇక్కడికి తీసుకొచ్చి.. లారీలోకి  ఎక్కిస్తారు.
* రెండు నెలల క్రితం ఎల్కతుర్తి వద్ద 350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


నాన బెట్టి.. ఆరబోసి..

 

లబ్ధిదారుల నుంచి క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేస్తున్నారు. బియ్యాన్ని రాత్రిపూట నీళ్లలో నానబెడుతున్నారు. నానిన బియ్యాన్ని ఇళ్ల స్లాబ్‌పై ఆరబెడుతున్నారు. తర్వాత నూకలుగా మారుస్తున్నారు. తర్వాత సంచుల్లో నింపి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, మహారాష్ట్రలోని బీర్లు, లిక్కర్‌ ఫ్యాక్టరీలు, కోళ్ల పరిశ్రమలకు పంపిస్తూ చీకటి దందాను నడిపిస్తున్నారు.


అమ్మినా, కొన్నా నేరమే

-వసంత లక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి

ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమం గా విక్రయించినా, కొనుగో లు చేసినా నేరం. జిల్లా వ్యాప్తంగా విసృతంగా తని ఖీలు చేస్తున్నాం. ఇటీవల అక్రమంగా బియ్యం సరఫ రా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశాం. అక్ర మాల కు పాల్పడుతున్న వారిపై సమాచారం ఇవ్వాలి.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని