logo

మన మెట్ల బావులనూ బాగు చేద్దాం

రాజధాని నగరం సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలో చెత్తతో నిండిన మెట్ల బావిని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది.

Published : 07 Dec 2022 05:25 IST

ఈనాడు, వరంగల్‌, శివనగర్‌, న్యూస్‌టుడే

అందంగా.. సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట మెట్లబావి

రాజధాని నగరం సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలో చెత్తతో నిండిన మెట్ల బావిని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. రూ.10 కోట్లు కేటాయించి అందులోని 3900 మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించారు. మంత్రులు కేటీఆర్‌ దీన్ని సోమవారం ప్రారంభించారు. ఓరుగల్లు నగరంలోనూ ఇలాంటి మెట్ల బావులు అయిదు ఉన్నాయి. వీటినీ పర్యాటక ప్రాంతాలుగా మారిస్తే రాజధానిని  మించి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.

కాకతీయులదే ఘనత: ఓరుగల్లు నగరంలో మూడు మెట్ల బావులను కాకతీయ రాజులే నిర్మించారు. మరో రెండు ఆ తర్వాత నిర్మించినవి. వీటికి కొన్నేళ్ల కిందట వరంగ్‌ నగర పాలక సంస్థ మరమ్మతులు చేపట్టింది. రూ.లక్షలు వెచ్చించి ఇందులో చెత్తను తొలగించి ప్రజలు సందర్శించేలా చేసింది. తర్వాత నిర్వహణ వదిలేయడంతో తిరిగి చెత్తతో నిండిపోయాయి. 

ఇలా చేద్దాం..

* నగరంలో కొన్నేళ్ల వరకు ఎవరూ అంతగా పట్టించుకోని అగ్గలయ్య గుట్టను ‘హృదయ్‌’ పథకం కింద చేర్చడంతో అది బాగుపడింది. రూ.1.2 కోట్లు వెచ్చించి, కొండపైకి మెట్లు చెక్కారు. ఇప్పుడు గుట్ట నిర్వహణ బాగా చేస్తుండడంతో రోజూ వందలాది పర్యాటకులు వస్తున్నారు. ఇదే తరహాలో మెట్ల బావులనూ తీర్చిదిద్దొచ్చు.
* మహానగర పాలక సంస్థ సిబ్బంది కొందరు నిరుపయోగంగా ఉన్న మ్యూజికల్‌ గార్డెన్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. వారిని మెట్లబావుల నిర్వహణకు ఉంచొచ్చు.

అధ్వానంగా: మన కరీమాబాద్‌ వద్ద ఇలా..

ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

శివనగర్‌
కరీమాబాద్‌ (2)
ఖిలా వరంగల్‌ కోట
కొత్తవాడ


శివనగర్‌లో ఉన్న మెట్ల బావి ఎంతో విశాలంగా, సుందరంగా ఉంటుంది. ఇందులోకి దిగితే అనేక చారిత్రక శిల్పాలు కనువిందు చేస్తాయి.


అక్కడ యునెస్కో గుర్తింపు

 

గుజరాత్‌ పటాన్‌లో ఉన్న 11వ శతాబ్దం నాటి ‘రాణి కా వావ్‌’ మెట్ల బావిని అక్కడి ప్రభుత్వం సంరక్షించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. దీనికి 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కింది


నిర్వహణపై దృష్టి పెట్టాలి  

 

- అరవింద్‌ ఆర్య, యువ  చరిత్రకారుడు

గతంలో  మెట్ల బావులను బాగు చేయాలని అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేక వినతి పత్రాలు ఇచ్చాం. ఎట్టకేలకు రూ. 15 లక్షలకుపైగా వెచ్చించి బాగు చేశారు. మళ్లీ నిర్వహణ లేక నిర్లక్ష్యంగా వదిలేశారు. నిర్వహణ కోసం రూ.5 లేదా 10 టికెట్టు పెట్టినా సందర్శకులు వస్తారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని