logo

అక్కున చేర్చుకున్న ప్రజలకు అండగా ఉంటా..

రెండు దశాబ్దాలుగా అక్కున చేర్కుకున్న నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తానని మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.

Updated : 07 Dec 2022 06:26 IST

లింగాలలో వృద్ధులకు దుప్పట్లు అందిస్తున్న ఎమ్మెల్యే సీతక్క

తాడ్వాయి, న్యూస్‌టుడే: రెండు దశాబ్దాలుగా అక్కున చేర్కుకున్న నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తానని మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. మండలంలోని లింగాల, బోటిలింగాలలో 210 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తన పర్యటనల్లో గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తిస్తున్నానని, వాటన్నింటిని స్థానిక అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానన్నారు. చలికాలం పూర్తయ్యే వరకు గ్రామీణులు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు ముద్రకోళ్ల తిరుపతి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింత క్రాంతి పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మంగపేట: మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులు 26 మందికి మంగళవారం ఎమ్మెల్యే సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దారు శ్రీనివాసులు, సహకార సంఘం ఛైర్మన్‌ తోట రమేశ్‌ పాల్గొన్నారు.

విస్తృత పర్యటన

మంగపేట: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. కమలాపురం, రాజుపేటలో అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంగంపల్లిలోని ఎస్సీవాడలో 25 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. బోరునర్సాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జయరాంరెడ్డిని పరామర్శించారు. కమలాపురంలో సీఎస్‌ఆర్‌ నిధుల కింద చేపట్టిన రేకులషెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మీ, నాయకులు ఆక రాధాకృష్ణ, పూజారి సురేందర్‌, భగవాన్‌రెడ్డి, యానయ్య, లాలయ్య, మల్లయ్య, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు