logo

జాతర పనులు నాలుగు రోజుల్లో పూర్తవ్వాలి

మరో నాలుగు రోజుల్లోగా మేడారం చిన్న జాతర పనులు పూర్తి కావాలని ఐటీడీఏ పీవో అంకిత్‌ అధికారులను ఆదేశించారు.

Published : 19 Jan 2023 06:07 IST

అధికారులతో సమీక్షిస్తున్న ఐటీడీఏ పీవో అంకిత్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: మరో నాలుగు రోజుల్లోగా మేడారం చిన్న జాతర పనులు పూర్తి కావాలని ఐటీడీఏ పీవో అంకిత్‌ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షించారు. జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల వారీగా పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులకు గాను కార్మికులను నియమించాలని చెప్పారు. సెప్టిక్‌ ట్యాంకులు, మరుగుదొడ్లు వెంట వెంటనే శుభ్రం చేయడం వంటి పనులకు గాను సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా కోసం అవసరమైన పరికరాల కోసం విద్యుత్తు, దేవాదాయ, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఊట బావులలో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలను బిగించాలని, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల వద్ద ఇనుప కంచె అమర్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఐలాపూర్‌, దొడ్ల, కొండాయి గ్రామాల్లోని వనదేవతల ఆలయాలకు రంగులు వేసి, విద్యుదీకరణ పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఏపీవో వసంతరావు, ఏవో టీవీఆర్‌.దామోదరస్వామి, ఎస్‌వో రాజ్‌కుమార్‌, మేడారం ఈవో రాజేంద్రం, ఈఈ సుభాష్‌, డీఈలు రవీందర్‌, సదయ్య, డీడబ్ల్యూవో ప్రేమలత, డీఎంజీసీసీ ప్రతాప్‌రెడ్డి, ఏసీఎంవో కోడి రవీందర్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ ఎస్‌వో లాల్‌నాయక్‌, జీసీడీవో సుగుణ, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని