logo

‘ఆదివాసీలపై గిరిజనేతరుల పెత్తనం’

ఆదివాసీ ప్రజాప్రతినిధులపై గిరిజనేతర నాయకులు పెత్తనం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుడుందెబ్బ జిల్లా ప్రధానకార్యదర్శి ఆలూరి రాజు ఆరోపించారు.

Published : 19 Jan 2023 06:07 IST

మాట్లాడుతున్న తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు

కొత్తగూడ, న్యూస్‌టుడే: ఆదివాసీ ప్రజాప్రతినిధులపై గిరిజనేతర నాయకులు పెత్తనం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుడుందెబ్బ జిల్లా ప్రధానకార్యదర్శి ఆలూరి రాజు ఆరోపించారు. బుధవారం కొత్తగూడలో జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు గిరిజనేతర నాయకులు ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నారని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ఏర్పాటుకానున్న మల్లంపల్లి మండలంలో కొత్తగూడ మండలంలోని కొన్ని ఆదివాసీ గ్రామాలను కలిపేందుకు ఆదివాసీ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా గ్రామసభ తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి వారి చర్యలతో ఆదివాసీలకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. సంఘం నాయకులు విక్రమ్‌, సాగర్‌, బుచ్చిరాములు, సత్యనారాయణ, కార్తిక్‌, నర్సింగరావు, జీవన్‌, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని