logo

నిఘా నేత్రాల ఏర్పాటుకు దాతల సాయం

బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న చోరీలు, నేరాలను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. సీసీ కెమెరాలతో నిందితులను సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది.

Published : 23 Jan 2023 03:48 IST

బచ్చన్నపేట, న్యూస్‌టుడే: బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో జరుగుతున్న చోరీలు, నేరాలను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. సీసీ కెమెరాలతో నిందితులను సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది. సీసీ కెమెరాల ఆవశ్యకతపై పోలీసులు గ్రామాల్లో కళాబృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పలువురు దాతలు ముందుకొచ్చి నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.  

మండలంలో 26 గ్రామాలు ఉన్నాయి. బచ్చన్నపేటలో రెండేళ్ల క్రితం అప్పటి ఎస్సై ఆధ్వర్యంలో కేబీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కొండి వెంకట్‌రెడ్డి రూ.2.5 లక్షల విలువైన 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో.. పోచన్నపేటలో రూ.2 లక్షల విలువైన 22 సీసీ కెమెరాలు,  ఆలీంపూర్‌లో రూ.50 వేల విలువ కలిగిన 14 సీసీ కెమెరాలు, సాల్వాపూర్‌లో రూ.60 వేల విలువైన 17 సీసీ కెమెరాలు, పోలీస్‌స్టేషన్‌లో 16 కెమెరాలను ఏర్పాటు చేశారు.


ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి

ఎస్సై నవీన్‌కుమార్‌, బచ్చన్నపేట

గ్రామాల్లో దాతల సాయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో చోరీలు, గొడవలు జరిగే అస్కారం ఉండదు.  గ్రామంలో ఏదయినా సంఘటన జరిగితే సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి శిక్షించే అవకాశం ఉంటుంది. మిగతా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి దాతల సహకారంతో గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని