logo

భద్రకాళి బండ్‌పై సగర్వంగా ఘనకీర్తి

భద్రకాళి బండ్‌పైన మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతోంది. హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌ సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన విధంగా వరంగల్‌ భద్రకాళి బండ్‌ పైన 150 అడుగుల భారీ జాతీయ జెండా ఏర్పాటుతో 365 రోజులు నగర వాసులకు స్ఫూర్తి కలిగిస్తుంది.

Published : 26 Jan 2023 04:33 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: భద్రకాళి బండ్‌పైన మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతోంది. హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌ సంజీవయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన విధంగా వరంగల్‌ భద్రకాళి బండ్‌ పైన 150 అడుగుల భారీ జాతీయ జెండా ఏర్పాటుతో 365 రోజులు నగర వాసులకు స్ఫూర్తి కలిగిస్తుంది. గ్రేటర్‌ వరంగల్‌ సాధారణ నిధుల ద్వారా సుమారు రూ.25 లక్షలతో ఏర్పాటుకు ప్రతిపాధించారు. వరంగల్‌ పోతనరోడ్డు వైపు ప్రధాన ద్వారం ముస్తాబవుతోంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అతి త్వరలోనే బోటింగ్‌ అందుబాటులోకి రానుంది. సందర్శకులు బోటు షికారు ద్వారా భద్రకాళి చెరువు అందాలు, శ్రీ భద్రకాళి దేవాలయం, 150 అడుగుల జాతీయ జెండా కూడలి చూసేందుకు అవకాశం దక్కుతుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ జెండాను నేడు(గురువారం) ప్రారంభిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని