logo

ఓటు సామాన్యుడి వజ్రాయుధం

18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావడం కర్తవ్యంగా భావించాలని, ఓటు సామాన్యుడి వజ్రాయుధమని జిల్లా పాలనాధికారి గోపి అన్నారు.

Published : 26 Jan 2023 04:33 IST

సిబ్బందికి సూచనలు చేస్తున్న కలెక్టర్‌ గోపి, అదనపు కలెక్టర్‌ అశ్వని తానాజీ  

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: 18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావడం కర్తవ్యంగా భావించాలని, ఓటు సామాన్యుడి వజ్రాయుధమని జిల్లా పాలనాధికారి గోపి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సంతకాల సేకరణలో సంతకం చేసి అధికారులతో ఆయన ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఓటుహక్కు ప్రాధాన్యతను వివరించారు. గతంలో కేవలం పన్ను చెల్లించే వారు, సమాజంలో ఉన్నతస్థానాల్లో ఉన్నవారికి మాత్రమే ఓటుహక్కు ఉండేదని.. భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కల్పించిందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను వందశాతం పూర్తిచేసిన బీఎల్వోలను కలెక్టర్‌ అభినందించారు. అదనపు కలెక్టర్‌ శ్రీవత్స, ఆర్డీవో మహేందర్‌జీ, స్వీప్‌ నోడల్‌ అధికారి నర్సింహమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.

కంటి వెలుగు శిబిరం పరిశీలన

వర్ధన్నపేట: కంటి వెలుగు శిబిరానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ గోపి సూచించారు. వర్ధన్నపేట మూడో వార్డులో నిర్వహిస్తున్న శిబిరాన్ని బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ అశ్వని తానాజీ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ ఛైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌, మూడో వార్డు కౌన్సిలర్‌ అనిత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని