logo

స్వచ్ఛ వరంగలే లక్ష్యం

స్వచ్ఛ వరంగలే లక్ష్యంగా అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు కలిసికట్టుగా ముందుకు సాగుతామని బల్దియా మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య తెలిపారు.

Published : 27 Jan 2023 06:23 IST

గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న  కమిషనర్‌ ప్రావీణ్య, చిత్రంలో మేయర్‌ సుధారాణి, కార్పొరేటర్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: స్వచ్ఛ వరంగలే లక్ష్యంగా అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు కలిసికట్టుగా ముందుకు సాగుతామని బల్దియా మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య తెలిపారు. గురువారం భారత గణతంత్ర దినోత్సవం సందర్భాంగా గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో, హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ టౌన్‌హాల్‌ వద్ద జాతీయ జెండాను కమిషనర్‌ ఎగుర వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మేయర్‌, కమిషనర్లు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీస్‌లో జాతీయ స్థాయిలో వరంగల్‌ నగరంలో మూడో స్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తి ఈ ఏడాది 2023 స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో మెరుగైన ర్యాంకు దక్కేలా జట్టులా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో ఉపమేయర్‌ రిజ్వానా షమీమ్‌, అదనపు కమిషనర్‌ రవీందర్‌యాదవ్‌, ఉపకమిషనర్లు రషీద్‌, జోనా, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్‌చంద్ర, కార్పొరేటర్లు, అన్ని విభాగాల వింగ్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని