logo

శంకుస్థాపన గద్దె కూల్చివేత

ఈనెల 31న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్న ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం శంకుస్థాపన గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు

Published : 29 Jan 2023 06:20 IST

ఆందోళన చేస్తున్న ఎస్సీ కాలనీ వాసులు, భారాస నేతలు

కమలాపూర్‌, న్యూస్‌టుడే: ఈనెల 31న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్న ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం శంకుస్థాపన గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు, భారాస శ్రేణులు కూల్చిన గద్దెను పరిశీలించి ఆందోళన చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌ సంజీవ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారాస నాయకులు, కాలనీ వాసులు ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ముగ్గురిపై కేసు: మండల కేంద్రానికి చెందిన అన్వేశ్‌, యేసోబూ అలియాస్‌ పుల్ల జోసెఫ్‌, పుల్ల పున్నమయ్య కలిసి శుక్రవారం అర్ధరాత్రి ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ శంకుస్థాపన గద్దెను గడ్డపారలతో కూల్చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మాట్ల వెంకటేశ్వర్లు (ఎంపీటీసీ సభ్యుడు) మూత్ర విసర్జనకు నిద్రలేచి బయటకు వచ్చాడు. శబ్ధం విని తన టార్చిలైట్తో ఆ స్థలంలోకి వెళ్లి చూసే సరికి అతని మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారు. స్థలం పక్కనే ఉన్న పుల్ల పున్నం చందర్‌ అనే మరో వ్యక్తి రాగా అతనిని కూడా చంపుతామని బెదిరించారని వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోటం సతీశ్‌ శనివారం రాత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని