మేడారం కాదు.. భూ పోరాటం!
జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు శిఖం భూముల్లో, అదే చెరువు సమీపంలోని కేటీకే 6వ గని రహదారి పక్కన ప్రభుత్వ భూముల్లో మూకుమ్మడిగా వేల సంఖ్యలో పేదలు చేరుకుని గుడిసెలు వేసుకుంటున్నారు
పాత ఎర్ర చెరువు సమీపంలో మేడారం జాతరలా పేదల గుడిసెలు
జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు శిఖం భూముల్లో, అదే చెరువు సమీపంలోని కేటీకే 6వ గని రహదారి పక్కన ప్రభుత్వ భూముల్లో మూకుమ్మడిగా వేల సంఖ్యలో పేదలు చేరుకుని గుడిసెలు వేసుకుంటున్నారు. ఈనెల 24న మొదలైన గుడిసెలు వేసుకునే ప్రక్రియ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 3 వేలకు పైగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం మేడారం జాతరను తలపించేలా పేదల గుడిసెలు, జనాల రాకపోకలతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. అందులోనే చిరు హోటళ్లు, తినుబండారాల దుకాణాలు, పాన్ షాపులు వెలిశాయి. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణానికి అతి సమీపంలోని పాత ఎర్ర చెరువు శిఖం భూములు 280, 283, 284, 285 సర్వే నంబర్లలో 29.30 ఎకరాల భూముల్లో ఎర్ర జెండాలు పాతి ఈ నెల 24న గుడిసెలు వేసుకునేందుకు భూ పోరాటం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేలాది మంది పేదలు, మహిళలు వారి కుటుంబ సభ్యులతో చేరుకుని, తాత్కాలికంగా కర్రలు, దారాలు, పాత చీరలతో గుడిసెలు వేసుకునేందుకు ఎవరికి వారు హద్దులు నిర్ణయించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రాంతం జాతరలా కనిపిస్తోంది. ప్రభుత్వ భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో వాహనాల్లో పేదలు వస్తున్నారు. తాత్కాలిక గుడిసెలు వేసుకునేందుకు సమీపంలోని అడవుల్లో నుంచే కర్రలు తెచ్చుకుని, చీరెలు, దారాలతో హద్దులు నిర్ణయించుకుంటున్నారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించి, గుడిసెలు వేసేందుకు ప్రోత్సహించిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు పోలీసులు, అధికారులు వచ్చి గుడిసెలను తొలగిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
న్యూస్‌టుడే, భూపాలపల్లి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!
-
Sports News
MIW vs UPW: యూపీపై విజయం.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి
-
Crime News
Agra: చిలుక వాంగ్మూలంతో హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు!
-
General News
Andhra news: సీఎస్తో ఉద్యోగసంఘాల భేటీ.. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం