logo

ఓరుగల్లులో వీరయ్య.. అభిమానుల్లో పూనకాలు!!

మెగాస్టార్‌ చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’గా ప్రజల ముందుకు వచ్చి ఘన విజయం సాధించారు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు

Published : 29 Jan 2023 06:35 IST

మెగాస్టార్‌ చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’గా ప్రజల ముందుకు వచ్చి ఘన విజయం సాధించారు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు.. సంబరాలు చేసుకోవడానికి ఓరుగల్లు వచ్చారు. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి సందడి చేశారు. అభిమానులను ఉర్రూతలూగించారు.. తన ప్రసంగంతో పూనకాలు నింపారు..

హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం రాత్రి వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభ జరిగింది. మోగా అభిమానులు మధ్యాహ్నం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.  చిరంజీవి, రామ్‌చరణ్‌ చిత్రాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ గ్యాలరీలో  యువత కేరింతలు పెట్టారు. సాయంత్రం నృత్య, గేయ కళాకారులు ఆటపాటలతో అదరగొట్టారు. నటులు శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, భరణి, సుభాష్‌, సాయి, శ్రీధర్‌, శకలక శంకర్‌, శివప్రసాద్‌, రచ్చ రవి ప్రసంగిస్తూ మెగాస్టార్‌ పక్కన నటించడం తమ అదృష్టమని చెప్పారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన వేడుకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, రమేశ్‌, శంకర్‌నాయక్‌, నరేందర్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మేయర్‌ సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పాల్గొన్నారు.

గజమాలతో అభిమానుల సన్మానం


సభ జరిగిన తీరుఇలా
సాయంత్రం 6:17గంటలకు: ఆటపాటలతో ప్రారంభమైన వేడుక
6:54: కొరియోగ్రాఫర్‌ చిట్టి బృందం నృత్యం
7:23: వాగ్దేవి కళాశాల విద్యార్థుల ప్రదర్శన
7:45: సింగర్‌ రోల్‌రైడా ఆలపించిన పూనకాలు లోడింగ్‌ పాటతో అభిమానుల కేరింతలు
7:50: వేదికపైకి వచ్చిన చిరంజీవి
7:54: వాల్తేరు వీరయ్య షూటింగ్‌లోని కొన్ని సన్నివేశాల ప్రదర్శన
రాత్రి 8.36: సినిమా బృందానికి జ్ఞాపికల అందజేత
9:00: డైరెక్టర్‌ బాబీ ప్రసంగం
9.20: హీరో రాంచరణ్‌ ప్రసంగం
9.29: అభిమానులను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు.
9.57 వేడుకలు ముగింపు
10.05: హనుమకొండలోని మంత్రి దయాకర్‌రావు నివాసానికి చేరుకున్నారు.
10.30: భోజనం చేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు
.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని