పర్వతమెక్కిన శివయ్య
పర్వతగిరి పెద్ద చెరువు రిజర్వాయర్ సమీపంలోని కొండపై నిర్మించిన పర్వతాల శివాలయంలో శనివారం అంగరంగ వైభవంగా విగ్రహ, యంత్ర ప్రతిష్ఠాపక కార్యక్రమాలు కనులపండువగా సాగాయి
విగ్రహ ప్రతిష్ఠకు తరలివచ్చిన భక్తులు
పర్వతగిరి, న్యూస్‌టుడే: పర్వతగిరి పెద్ద చెరువు రిజర్వాయర్ సమీపంలోని కొండపై నిర్మించిన పర్వతాల శివాలయంలో శనివారం అంగరంగ వైభవంగా విగ్రహ, యంత్ర ప్రతిష్ఠాపక కార్యక్రమాలు కనులపండువగా సాగాయి. శివయ్య దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తరలిరాడంతో శివనామస్మరణతో పర్వతం మారుమోగింది. శివ క్షేత్రం పీఠాధిపతి శివస్వామితో విగ్రహ, యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాల నిర్వహించగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కుటుంబసభ్యులు, ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు దంపతులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్, ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు.
పూజల్లో పాల్గొన్న ప్రముఖులు
విగ్రహ, యంత్ర ప్రతిష్ఠ మహోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని అర్చన కార్యక్రమాలను చేపట్టారు. వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, చీఫ్ విఫ్ దాస్యం వినయ్‌భాస్కర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘన్‌పూర్, మహబూబాబాద్, హుస్నాబాద్, పరకాల ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, బానోతు శంకర్‌నాయక్ దంపతులు, వొడితల సతీష్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జనగామ జడ్పీ ఛైర్మన్ సంపత్‌రెడ్డి దంపతులు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, రాష్ట్ర రుణవిమోచన కన్వీనర్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ మునిసిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ ఫరీద్, కమిషనర్ ప్రసన్నవాణి, భాజపా జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెలే ధర్మారావు, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, స్పెషల్ కమిషనర్ వీఎస్‌ఎన్ ప్రసాద్, మెంబర్ సెక్రటరీ ఎ.రాజారావు, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, పంచాయతీరాజ్ ఈఎస్‌సీ సంజీవరావు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపీ, శశాంక్ దంపతులు హాజరయ్యారు. వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, టీఎస్‌ఎస్ 4వ బెటాలియన్ కమాండెంట్‌లు, డీఆర్‌డీవో సంపత్‌రావు, జడ్పీ సీఈవో సాహితీమిత్ర, మూమునూరు ఏసీపీ నరేష్‌కుమార్ పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్ధప్రసాదాలు తీసుకున్నారు. వారి వెంట ఎంపీపీ కమల, జడ్పీటీసీ సభ్యుడు సింగులాల్, కల్లెడ సొసైటీ ఛైర్మన్ మనోజ్‌గౌడ్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మేడిశెట్టి రాములు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, స్థానిక సర్పంచి మాలతి, ఎంపీటీసీ సభ్యుడు రాజు, సోమేశ్వర్‌రావు, సర్వర్, శ్యాంగౌడ్, మధు, సందెల నవీన్, రంగు జనార్దన్‌గౌడ్, సీఏ రాజు, కాట్రోజు రాజు తదితరులు ఉన్నారు. మూడు రోజులుగా సాగిన పర్వతాల శివాలయం విగ్రహ పునః ప్రతిష్ఠ వేడుకలు శనివారంతో ముగిశాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!
-
Sports News
MIW vs UPW: యూపీపై విజయం.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ముంబయి