logo

మండ మెలిగె పండగకు వేళాయె..!

మహాజాతర తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగ(చిన్నజాతర)కు వేళయింది.

Published : 31 Jan 2023 05:28 IST

ఎత్తు బంగారంతో..

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: (తాడ్వాయి, న్యూస్‌టుడే): మహాజాతర తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగ(చిన్నజాతర)కు వేళయింది. ఆదివాసీల సంప్రదాయాలతో చిన్న జాతరను రేపటి నుంచి 4వ తేదీ వరకు మేడారంలో అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం సమ్మక్క, సారలమ్మల ఆలయాలతో పాటు, గద్దె ప్రాంగణాలను ముస్తాబు చేశారు. జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. పూజారులు పూజాది కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.  

మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాష్ట్రాల నుంచి కూడా తరలిరానున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య, తదితర పనులు పూర్తిచేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపడుతున్నారు. జంపన్నవాగులో స్నానాలు, గద్దెల వద్ద ఎత్తు బంగారం(బెల్లం)తో వన దేవతలను కొలవనున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని