logo

బంగారు గొలుసు దొంగల అరెస్టు

ఐనవోలు మల్లన్న జాతర ఉత్సవాల్లో భక్తురాలు మెడలోంచి బంగారు గొలుసు దొంగతనం చేసిన వ్యక్తులను సోమవారం ఈస్ట్‌ జోన్‌ డీసీపీ పుల్లా కరుణాకర్‌ అరెస్టు చేసినట్లు చెప్పారు.

Published : 31 Jan 2023 05:28 IST

ఐనవోలు, న్యూస్‌టుడే: ఐనవోలు మల్లన్న జాతర ఉత్సవాల్లో భక్తురాలు మెడలోంచి బంగారు గొలుసు దొంగతనం చేసిన వ్యక్తులను సోమవారం ఈస్ట్‌ జోన్‌ డీసీపీ పుల్లా కరుణాకర్‌ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఐనవోలు జాతరకు ఈ నెల 21న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన గండు వసంత కుటుంబ సభ్యులతో వచ్చారు. బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకునే క్రమంలో ఆమె మెడలోంచి నాలుగు తులాల గొలుసు (పుస్తెలు తాడు)ను గుర్తు తెలియని వ్యక్తి అపహరించిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్‌పే, మొబైల్‌ లోకేష్‌ ద్వారా నిందితుడిని ట్రాక్‌చేశారు. గీసుకొండ మండలం వంచనగిరికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎల్లబోయిన హరీష్‌గా నిర్ధారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. ఇదే గ్రామానికి చెందిన శోబోతు భిక్షపతి సహకారంతో బంగారు గొలుసు విక్రయించేందుకు నెక్కొండ మండలం అలంఖానిపేటకి చెందిన బోయినపల్లి సూర్యప్రకాష్‌ అనే వ్యక్తిని సంప్రదించారు. గొలుసును స్వీకరించిన ఆయన మొత్తంగా రూ.2.06 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫోన్‌పే ద్వారా రూ.26 వేలు, నగదుగా రూ.1.80 లక్షలు ఇచ్చారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భిక్షపతికి రూ.50 వేలు హరీష్‌ అందజేశాడు. ఇందులో రూ.26 అవసరాల నిమిత్తం ఖర్చు చేశాడు. నేరస్థులను పట్టుకున్న ఎస్సై వెంకన్నను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని