logo

మేడారానికి జాతర శోభ

రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహిస్తారు. తర్వాత ఏడాది నిర్వహించేదే చిన్న జాతర. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరగనుంది.

Updated : 31 Jan 2023 06:44 IST

 రేపటి నుంచి ప్రారంభం
రూ. 2.82 కోట్లతో భక్తులకు సౌకర్యాలు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, న్యూస్‌టుడే

రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహిస్తారు. తర్వాత ఏడాది నిర్వహించేదే చిన్న జాతర. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరగనుంది. అప్పుడే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. సమ్మక్క, సారలమ్మలను నిష్ఠతో కొలుస్తున్నారు. చిన్నజాతరకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా రూ. 2.82 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేశారు.


చలువ పందిళ్లు

* శాఖ: దేవాదాయ
* చేపట్టిన పనులు: వనదేవతల గద్దెల ప్రాంగణం, గద్దెలపై చలువ పందిళ్లు వేసింది. గద్దెల పరిసరాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు.


వసతి గృహాలు

* గిరిజన సంక్షేమ శాఖ
* కేటాయించిన నిధులు: రూ 21.10 లక్షలు
* బయ్యక్కపేటలో సమ్మక్క, సారలమ్మ గద్దెల పరిసరాల్లో మౌలిక సౌకర్యాలు, మేడారంలో సులభ్‌కాంప్లెక్స్‌ మరమ్మతులు, మేడారంలో మహిళలు దుస్తులు మార్చుకొనే గదుల మరమ్మతులు చేయించారు.


ఇవి సైతం..

ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా మూడు చోట్ల పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. బందోబస్తు కోసం 300 పోలీసు సిబ్బందిని సమకూర్చారు. గద్దెల పరిసరాల్లో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటు చేశారు. 50 వేల మాస్కులు ఏర్పాటు చేశారు. హనుమకొండ, ములుగు నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నారు. భక్తుల విడిది కోసం 5 విడిది షెడ్లను అందుబాటులోకి తెచ్చారు.


రహదారుల నిర్మాణం

* పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ * రూ. 15 లక్షలు*జాతర పరిసరాల్లోని రెడ్డిగూడెం, హరితహోటల్‌, ఆర్టీసీˆ బస్టాండ్‌, ఊరట్టం, తదితర 12 చోట్ల రహదారులను మరమ్మతులు చేశారు.


కుళాయిల ఏర్పాటు

* ఆర్‌డబ్ల్యూఎస్‌ *రూ. 22.90 లక్షలు
* జాతర పరిసరాల్లో 18 చోట్ల బ్యాటరీ ఆఫ్‌ట్యాప్స్‌ ఏర్పాటు చేశారు. 110 చేతి పంపులకు మరమ్మతులు చేశారు. జాతర పరిసరాల్లోని 4 సులభ్‌కాంప్లెక్సులను వినియోగంలోకి తీసుకొచ్చారు..


పారిశుద్ధ్యం నిర్వహణ

* జిల్లా పంచాయతీ అధికారి
* రూ. 69.64 లక్షలు
* పారిశుద్ధ్య పనుల కోసం 240 మంది కార్మికులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని రాజమండ్రి నుంచి తెప్పించారు. రహదారులకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించారు. పర్యవేక్షణకు, 150 మంది సిబ్బందిని నియమించారు.


జల్లు స్నానాలు

* నీటిపారుదల  *11.70 లక్షలు
* జంపన్నవాగు వాగుకు ఇరువైపులా 20 షవర్లు, 10 దుస్తులు మార్చుకొనే గదులు సిద్ధం చేశారు. నీటి కాలుష్యం నివారణకు క్లోరినేషన్‌ సౌకర్యం కల్పించారు.
వెలుగులు..
* విద్యుత్తు* రూ. 43లక్షలు*  16 చోట్ల 100 కేవీ నియంత్రికలు, 260 కేవీ నియంత్రికలు సిద్ధం చేశారు. వాటి పరిధిలో విద్యుత్తు స్తంభాలకు తీగలను పునరుద్ధరించారు.


ఏర్పాట్లు పూర్తి చేశాం : రాజేంద్రం, ఈవో, మేడారం ఆలయం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిన్న జాతరకు ఏర్పాట్లు పూర్తిచేశాం. దాదాపు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, తదితర అన్ని ఏర్పాటు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని