logo

రూ. లక్షన్నర ఖర్చయినా రోడ్డెక్కని వాహనం

వాహనాల మరమ్మతుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఒకే వాహనానికి రెండుసార్లు మరమ్మతుల పేరుతో బిల్లు డ్రా చేస్తున్నట్లు సమాచారం.

Published : 02 Feb 2023 05:38 IST

వాహనాల మరమ్మతుల షెడ్డులో ..

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వాహనాల మరమ్మతుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఒకే వాహనానికి రెండుసార్లు మరమ్మతుల పేరుతో బిల్లు డ్రా చేస్తున్నట్లు సమాచారం. నగర ప్రధాన రహదారుల్లో చెత్తను తరలించే కంఫాక్టర్‌ వాహనం మరమ్మతుకు రెండు సార్లు రూ.1.50 లక్షలు ఖర్చు చేసినా ఇంత వరకు రోడ్డెక్కడం లేదు.  డ్రైవర్లు అడిగితే మళ్లీ రిపేర్‌కు వచ్చిందంటున్నారు. రెండున్నర నెలలుగా షెడ్డులో ఉన్న వాహనానికి తొలుత రూ.1.10లక్షలు, రెండోసారి రూ.40వేలు బిల్లులు చేసినట్లుగా తెలిసింది. మరమ్మతుల్లో జాప్యమవుతుందని, 15 వాహనాల జాబితాను ఒప్పంద డ్రైవర్లు ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌కు అందజేశారు. ఒప్పంద పద్ధతిపై పనిచేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు తప్పుడు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు