logo

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ఆపరేషన్‌ జంజీర్‌

వరంగల్‌ మహానగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఆపరేషన్‌ జంజీర్‌ చేపట్టారు. ప్రధాన రహదారులపై చిరువ్యాపారులు తమ తోపుడు బండ్లను తిప్పుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

Published : 02 Feb 2023 05:38 IST

వరంగల్‌లో తోపుడు బండికి తాళం వేస్తున్న పోలీసులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ మహానగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఆపరేషన్‌ జంజీర్‌ చేపట్టారు. ప్రధాన రహదారులపై చిరువ్యాపారులు తమ తోపుడు బండ్లను తిప్పుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వీటిని నిర్ధిష్టమైన ప్రాంతంలో ఉంచేలా ప్రణాళికలు తయారు చేశారు. ఇందులో భాగంగా బండ్లను అటు, ఇటు తిప్పకుండా ట్రాఫిక్‌  కానిస్టేబుళ్లు వాటికి చైన్‌ సహాయంతో తాళం వేస్తున్నారు. ఆపరేషన్‌ జంజీర్‌ కార్యక్రమాన్ని బుధవారం తొలిసారిగా వరంగల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబులాల్‌ తన సిబ్బందితో కలిసి పోచమ్మమైదానంలో ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని బండ్లకు చైన్‌తో తాళం చేశారు. ఎస్సైలు రాజబాబు, డేవిడ్‌, ఆర్‌ఎస్సై పూర్ణచందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌, తోపుడు బండ్ల ఉమ్మడి వరంగల్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగమూర్తి, అధ్యక్షుడు ఫక్రూద్దీన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని