logo

మూడు రోజులు తాగునీటి సరఫరా బంద్‌

బల్దియా ఇంజినీర్ల బద్దకం నగర ప్రజలకు తిప్పలు తెస్తోంది. ఈ నెల ఆరో తేదీ నుంచి మూడురోజుల పాటు నగరంలో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.

Published : 03 Feb 2023 06:28 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : బల్దియా ఇంజినీర్ల బద్దకం నగర ప్రజలకు తిప్పలు తెస్తోంది. ఈ నెల ఆరో తేదీ నుంచి మూడురోజుల పాటు నగరంలో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ధర్మసాగర్‌ చెరువు వద్ద 2100 ఎంఎం డయా పైపులైన్‌ పైన కొత్తగా బట్టర్‌ ఫ్లై వాల్వు ఏర్పాటు చేయాలని గత ఏడాది నుంచి అంటున్నారు. చలికాలంలో పనులు చేపట్టాలని పలుమార్లు మేయర్‌, కమిషనర్‌ సూచించినా పట్టించుకోలేదు. వేసవి సమీపిస్తుండటంతో ఇప్పుడు ఆ  పనులు గుర్తుకొచ్చాయి. వాల్వు బిగించకుంటే నీరు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో పనులు చేపట్టనున్నారు. ఆ మూడు రోజుల పాటు వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ బీఎల్‌.శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌ రైల్వేగేటు జోన్‌ పరిధిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని