logo

Telangana News: పాఠశాలలో పురుగు మందు తాగిన విద్యార్థినులు

అభం.. శుభం తెలియని ముగ్గురు చిన్నారులు పాఠశాలలో ఓ శీతలపానీయం బాటిల్‌లో ఉన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం కేశవాపూర్‌ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది.

Updated : 03 Feb 2023 07:44 IST

ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్షర, అఖిల, ఐశ్వర్య

వెంకటాపూర్‌, ములుగు, న్యూస్‌టుడే: అభం.. శుభం తెలియని ముగ్గురు చిన్నారులు పాఠశాలలో ఓ శీతలపానీయం బాటిల్‌లో ఉన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం కేశవాపూర్‌ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల కథనం ప్రకారం.. నాలుగో తరగతి చదువుతున్న ఆరెపల్లి అక్షర(9), సాదు అఖిల(9), ఐదో తరగతికి చెందిన సాదు ఐశ్వర్య(10) ఏడుస్తుండగా తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాజేశ్‌కుమార్‌కు తెలియజేశారు. ఎందుకు ఏడుస్తున్నారని ఆయన వారిని ప్రశ్నించగా.. అక్షర బ్యాగులోని బాటిల్‌లో ఉన్న తెల్లని ద్రావణాన్ని ముగ్గురం కలిసి తాగినట్లు చెప్పారు. ఆ బాటిల్‌ను పురుగుల మందు వాసన రావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ములుగు ఏరియా ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని 24 గంటల వరకు పరిశీలించిన అనంతరం ఇంటికి పంపిస్తామని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.


బ్యాగులోకి ఎలా వచ్చింది..?

నాలుగో తరగతికి చెందిన విద్యార్థిని బ్యాగులోకి పురుగుల మందు డబ్బా ఎలా వచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఇతరులు ఎవరైనా ఇచ్చారా? లేక ఉపాధ్యాయులెవరైనా విద్యార్థినులను బెదిరింపులకు గురి చేశారా? తెలిసి తాగారా తెలియక తాగారా అనే ప్రశ్నలు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని