logo

అధిష్ఠానం ఆదేశిస్తే పాలకుర్తి నుంచి పోటీ చేస్తా

కాంగ్రెస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కొండా మురళీధర్‌రావు తెలిపారు.

Published : 04 Feb 2023 06:08 IST

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు

మాట్లాడుతున్న కొండా మురళీధర్‌రావు

తొర్రూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కొండా మురళీధర్‌రావు తెలిపారు. తొర్రూరులో పార్టీ పట్టణాధ్యక్షుడు సోమరాజశేఖర్‌ నివాసంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9 నుంచి వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండా సురేఖ పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. నియోజకవర్గంలో పార్టీ ఓటుబ్యాంకుకు కొదవలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కుదరకనే తాను భారాస నుంచి బయటకు వచ్చానన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు చెవిటి సధాకర్‌, వార్డు కౌన్సిలర్‌ భూసాని రాము, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, రాజుగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు