logo

కబ్జాదారులకు గుణపాఠం తప్పదు: కొండా మురళి

‘గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో అడుగడుగునా ఆక్రమణలు, కబ్జాలే, ఇంతెందుకు హనుమకొండ గోపాలపూర్‌లో నా ఫాంహౌజ్‌ స్థలాన్ని కబ్జా చేశారు.

Published : 04 Feb 2023 06:27 IST

తూర్పు నుంచే సురేఖ పోటీ

కాంగ్రెస్‌ నాయకులతో  సమావేశమైన కొండా మురళి

రంగంపేట, న్యూస్‌టుడే: ‘గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో అడుగడుగునా ఆక్రమణలు, కబ్జాలే, ఇంతెందుకు హనుమకొండ గోపాలపూర్‌లో నా ఫాంహౌజ్‌ స్థలాన్ని కబ్జా చేశారు. దీనివెనుక ఎమ్మెల్యే పాత్ర ఉంది’ అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కబ్జాదారులకు గుణపాఠం తప్పదన్నారు. వరంగల్‌ తూర్పు నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని తన నివాస గృహంలో తూర్పు ముఖ్య కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈనెల 9 నుంచి మాజీ మంత్రి సురేఖ పాదయాత్ర మొదలవుతుందని, డివిజన్ల వారీగా రూటు మ్యాపు ఖరారు చేయాలని కాంగ్రెస్‌ నాయకులను కోరారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను సమావేశంలో చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కొండా మురళీ మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హత్‌ సే హత్‌ జోడో యాత్రలో తూర్పు ముఖ్య నాయకులందరూ పాల్గొనాలన్నారు. కార్యకర్తలు ఎవరికీ భయపడొద్దని, మీకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటానని తెలిపారు. సమావేశంలో ముఖ్య నాయకులు రమేష్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు