logo

వరంగల్‌ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పావని

వరంగల్‌ జిల్లా రెండవ అదనపు, ఉమ్మడి జిల్లా ఎస్సీ,ఎస్టీ న్యాయస్థాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న పావని వరంగల్‌ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.

Published : 04 Feb 2023 06:27 IST

ఖమ్మం అదనపు జిల్లా జడ్జిగా రాంప్రసాద్‌

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా రెండవ అదనపు, ఉమ్మడి జిల్లా ఎస్సీ,ఎస్టీ న్యాయస్థాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న పావని వరంగల్‌ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 12మంది అదనపు జిల్లా జడ్జీలుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీలు చేస్తూ రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదిగా పనిచేస్తూ అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికైన మనీషా మెహ్రను ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం, వరంగల్‌ జిల్లా రెండో అదనపు న్యాయమూర్తిగా నియమితులైనారు. హనుమకొండ జిల్లా మొదటి అదనపు మునిసిఫ్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో శుక్రవారం వరకు సహాయక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న దేవినేని రాంప్రసాద్‌రావును ఖమ్మం జిల్లా మూడవ అదనపు, ఎస్సీ, ఎస్టీ న్యాయస్థాన న్యాయమూర్తిగా నియమించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు