logo

జిల్లా కోర్టులో వైద్య శిబిరం

అంతర్జాతీయ క్యాన్సర్‌ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కోర్టులో ‘ఉచిత వైద్య శిబిరాన్ని‘ ప్రారంభించారు.

Published : 05 Feb 2023 06:11 IST

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న హనుమకొండ జిల్లా జడ్జి  కృష్ణమూర్తి, వరంగల్‌ జిల్లా జడ్జి రాధాదేవి

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ క్యాన్సర్‌ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కోర్టులో ‘ఉచిత వైద్య శిబిరాన్ని‘ ప్రారంభించారు. ఒమేగా బన్ను ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో న్యాయసేవాధికార సంస్థసదన్‌ లో నిర్వహించిన ఈ శిబిరాన్ని వరంగల్‌, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, కోకా రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి లాంఛనంగా ప్రారంభించారు. న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలను చేయించుకున్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు పద్మజ, వెంకటేశ్వర్‌రావు, ఉపేందర్‌రావు, బి.శ్రీనివాసులు, వైద్యులు శ్రీవల్లి, భగీరథ్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


అన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరం కావు

దామెర, : దామెర క్రాస్‌ రోడ్డులోని ప్రతిమ క్యాన్సర్‌ ఆసుపత్రిలో అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి రాధాదేవి మాట్లాడుతూ.. అన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరం కావని, ముందుగా తెలుసుకుంటే మరణాలను తగ్గించే అవకాశం ఉందన్నారు. మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. దూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని