logo

ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం

ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా, ఆటంకాలు కలిగించినా ఇచ్చిన మాటకు కట్టుబడి కుల సంఘాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.

Published : 06 Feb 2023 04:10 IST

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని సన్మానిస్తున్న పద్మశాలి కుల సంఘం బాధ్యులు  

నర్సంపేట, న్యూస్‌టుడే: ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా, ఆటంకాలు కలిగించినా ఇచ్చిన మాటకు కట్టుబడి కుల సంఘాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అవి కుల సంఘ భవనాలు కావని కుల సంఘాల ప్రజల ఆత్మగౌరవ వేదికలని పేర్కొన్నారు. నర్సంపేటలోని పద్మశాలి కుల సంఘ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయడంపై  హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఆసంఘం నాయకులు ఓంప్రకాశ్‌, సర్వేశ్వం ఆధ్వర్యంలో పద్మశాలీలు స్థానిక క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కృతజ్ఞత సభను జరిపి ఎమ్మెల్యే పెద్దిని ఘనంగా సన్మానించారు.  మార్కండేయ కాలనీలో మురుగు కాలువలు, సీసీ రోడ్డు, ఇతర సౌకర్యాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని