‘భూస్వాములను తరిమికొట్టాలి’
రాష్ట్రంలో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదల సంఖ్య 40 లక్షలకు పైగానే ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపెల్లి నాగయ్య అన్నారు.
ప్రసంగిస్తున్న వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, పక్కన సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి తదితరులు
పస్రా(గోవిందరావుపేట), న్యూస్‌టుడే: రాష్ట్రంలో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదల సంఖ్య 40 లక్షలకు పైగానే ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపెల్లి నాగయ్య అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు లక్షల మందికి మాత్రమే స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. మిగిలిన వారికి ఇవ్వడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. గోవిందరావుపేట మండలం పస్రాలో గుడిసెవాసులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ భూములు తమవంటూ వచ్చే భూస్వాములను నిరుపేదలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 109 సర్వే నెంబరు భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు జారీ చేయాలన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల సాయాన్ని సైతం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి గుడిసెవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు సాంబశివ, టి.ఆదిరెడ్డి, పి.చిట్టిబాబు, ఎ.పోషాలు, ఎస్.ఆదిరెడ్డి, ఎ.మురళి, జి.రమేశ్, ఉపేంద్రాచారి, పి.రాజు, కె.రాజేశ్వరీ, పి.శారద, ఎస్.రాజేశ్వరీ, సరిత, జె.జ్యోతి, ఎ.పాషా, ఎం.కవిత పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని