logo

దుకాణ సముదాయ భవన నిర్మాణమెప్పుడో?

పాలకుర్తిలో దుకాణ సముదాయ భవన నిర్మాణానికి అడుగులు పడడం లేదు. దీంతో రహదారుల వెంట వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 06 Feb 2023 04:10 IST

పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా తాత్కాలిక దుకాణాలు

పాలకుర్తి, న్యూస్‌టుడే: పాలకుర్తిలో దుకాణ సముదాయ భవన నిర్మాణానికి అడుగులు పడడం లేదు. దీంతో రహదారుల వెంట వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా నిల్చొని వ్యాపారం చేస్తేనే.. వారికి నాలుగు పైసలు చేతికొస్తాయి. స్థానిక చౌరస్తాలో, ప్రధాన రహదారుల వెంట, కూడళ్ల వద్ద పలువురు చిరు వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రూ.లక్షల్లో అద్దెలు చెల్లించి దుకాణాలు తీసుకునే స్థోమత లేదని, అధికారులు కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

చౌరస్తానే ప్రధాన ఆకర్షణ

పాలకుర్తి పట్టణానికి రాజీవ్‌చౌరస్తా ప్రధాన ఆకర్షణ. ఇక్కడ ప్రధాన రహదారులకు నలు వైపులా సుమారు 100 అడుగుల రోడ్డు ఎంతో విశాలంగా ఉంటుంది. దశాబ్దాలుగా రోడ్ల వెంట పదుల సంఖ్యలో చిరువ్యాపారులు తోపుడు బండ్లు, నేలపై కూర్చొని వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరంతా పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలు. రోజంతా ఎండలో నిల్చొని వ్యాపారం చేస్తేనే పూట గడుస్తుంది. ఎండా, వాన, చలికి ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దుకాణ సముదాయ భవనం కోసం వారు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. పాలకులు, అధికారుల హామీలు అమలుకు నోచుకోవడం లేదు.

రహదారి విస్తరణలో డబ్బాల తొలగింపు

స్థానిక చౌరస్తాలో రెండేళ్ల క్రితం రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనేక మంది వ్యాపారులకు చెందిన దుకాణాల డబ్బాలను అధికారులు తొలగించారు. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత దుకాణాలు నిర్మించి ఇస్తామని అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. రహదారి నిర్మాణం పూర్తయినా.. దుకాణాలు నిర్మించడం లేదని బాధితులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అనుమతుల కోసం నిరీక్షణ
- యాకాంతరావు, సర్పంచి, పాలకుర్తి

ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రహదారి వెంట కొన్ని దుకాణాల నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. సుమారు 30 దుకాణాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. త్వరలోనే స్టేషన్‌ పరిధిలోని రోడ్డు వెంట దుకాణాల అనుమతులు కోసం ఉన్నతాధికారులకు వినతులు అందజేస్తాం. దుకాణ సముదాయ నిర్మాణం పూర్తయితే పాలకుర్తికి కొత్త శోభ వస్తుంది. చిరు వ్యాపారులకు సైతం అన్ని విధాలా ప్రయోజనంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని