logo

న్యాయ సహాయ కార్యాలయాలు ప్రారంభం

‘లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ సిస్టం’ కార్యాలయాన్ని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రారంభించారు.

Published : 07 Feb 2023 06:04 IST

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వరంగల్‌, హనుమకొండ
జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు రాధాదేవి, కృష్ణమూర్తి

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ‘లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ సిస్టం’ కార్యాలయాన్ని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో హైకోర్టు నుంచి ప్రారంభించారు. వరంగల్‌, హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యాలయాల వద్ద వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోకా రాధాదేవి, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి కొబ్బరికాయలు కొట్టి రిబ్బను కత్తిరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, సి.పావని, జయలక్ష్మి, జాబిశెట్టి ఉపేందర్‌రావు, బి.శ్రీనివాసులు, ఇతర న్యాయమూర్తులు, హనుమకొండ జిల్లా చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సెలర్‌ దేవులపల్లి శ్రీకాంత్‌, వరంగల్‌ జిల్లా చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సెలర్‌ ఆర్‌.సురేశ్‌, ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోకిల సత్యనారాయణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనందమోహన్‌, ప్రధాన కార్యదర్శి గునిగంటి శ్రీనివాస్‌, ఇతర సీనియర్‌, జూనియర్‌ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని