పర్యావరణ పరిరక్షణలో మేము సైతం..!
లింగాలఘనపురం యువతులకు అవకాశం వచ్చింది. అంది పుచ్చుకుంటున్నారు. ఓ వైపు ఉపాధి మరోవైపు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించే కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు.
సంచులు కుడుతున్న మహిళలు
లింగాలఘనపురం(జఫర్‌గఢ్) న్యూస్‌టుడే: లింగాలఘనపురం యువతులకు అవకాశం వచ్చింది. అంది పుచ్చుకుంటున్నారు. ఓ వైపు ఉపాధి మరోవైపు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించే కార్యక్రమంలో మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు. సృష్టి వినాశకారిణి అయిన ప్లాస్టిక్‌ను క్రమేనా తొలగించాలనే సంకల్పంతో నార సంచుల తయారీకి శిక్షణ పొందుతున్నారు. ‘శిక్షణ పూర్తి చేసుకుంటున్నాం..కుటీర పరిశ్రమ యూనిట్ స్థాపనకు నారసంచుల తయారీకి సిద్ధం’గా ఉన్నామంటూ యువతులు ‘న్యూస్‌టుడే’కు వివరించారు.
శిక్షణ ఇలా..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ) సౌజన్యంతో సొసైటీ ఫర్ హెల్త్ అగ్రికల్చర్ అండ్ రూరల్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింగాలఘనపురంలో చేపట్టిన శిక్షణ శిబిరంలో 25 మంది యువతులు, మహిళలు శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. శిక్షÛణలో టిఫిన్‌బాక్స్ కోసం క్యారియర్ బ్యాగ్, విద్యార్థులకు పెన్సిల్ పౌచ్, వాటర్ బాటిల్ బ్యాగ్, ఆఫీస్ ఫైల్ బ్యాగ్, మహిళల హ్యాండ్‌బ్యాగ్, మనీ, హ్యాండ్ పర్స్, ఫైల్ ఫోల్డర్, దుకాణం నుంచి సామగ్రి తెచ్చుకునేందుకు షాపింగ్ బ్యాగ్, కూరగాయల కొనుగోలు కోసం అవసరమైన సంచులు తయారు చేయడం నేర్చుకున్నారు.
తయారికి సిద్ధం - మేడబోయిన మాధవి
12 రకాల నార సంచుల తయారీ విధానం పూర్తిగా వచ్చేసింది. ఇక నాణ్యతగా ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తాం. ప్లాస్టిక్ సంచుల స్థానంలో ఆరోగ్యదాయకం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే నారసంచులను వాడాల్సిన అవసరాన్ని అలవాటు చేస్తాం.
ఉపాధి అవకాశం - నక్కపల్లి ఉమారాణి
ఇంట్లో ఖాళీగా ఉండకుండా నారసంచులు తయారు చేసి ఉపాధి పొందే అవకాశం దక్కింది. నేర్చుకున్న వాళ్లమంతా సామూహికంగా కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించాలి.
నైపుణ్యాలు తెలుసుకున్నాం - బెజ్జం వినోద
నార సంచుల తయారీలో నైపుణ్యతలు నేర్చుకున్నాం. మహిళా సమాఖ్య, మహిళా సంఘం సహకారంతో బ్యాంకు రుణం పొంది తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. సంచుల తయారీలో మెలకువలు నేర్పిన సుందరయ్య, నర్సింహాచారి, నాగదేవికి కృతజ్ఞతలు.
బాగా నేర్చుకున్నారు - నాగదేవి, బోధకురాలు
జ్యూట్ బోర్డు సభ్యురాలిగా(అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్‌ఫ్రైజెస్) మహిళా పారిశ్రామిక సంస్థ వారికి మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ అందించా. ఓఎన్‌జీసీలో పని చేసిన అనుభవంతో ఇప్పటి వరకు వెయ్యి శిక్షణ శిబిరాలలో 5 నుంచి 6 వేల మందికి శిక్షణ ఇచ్చాం. సుమారు 500 మంది జ్యూట్ బ్యాగ్‌లను తయారు చేసి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. లింగాలఘనపురంలో యువతులు, మహిళలు తొందరగా నేర్చుకున్నారు. మరో వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రాలు అందుకుంటారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని