logo

ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

నర్సంపేటలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురయ్యారు.

Updated : 08 Feb 2023 21:30 IST

నర్సంపేట : వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురయ్యారు. ఈ రోజు వేకువ జామున 6 గంటలకు ఆర్మీ డ్రిల్‌ మాస్టర్‌ విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాలలో 5,6,7 తరగతులు చదువుతున్న మొత్తం 34 మంది విద్యార్థులు వాంతులు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గోపాల్‌, డ్యూటీ డాక్టర్‌ ప్రావిణ్య  విద్యార్థులకు వైద్య సేవలు అందించారు.  తీవ్ర అస్వస్థతత ఉన్న విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోవడంలేదని మరికొందరు విద్యార్థులు వాపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు